GHMC: ఈరోజు (జనవరి 23) జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులో హైదరాబాద్ నగరంలో చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా చర్చించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్ల అభివృద్ధికి సిద్ధం చేసిన ప్లాన్ కి స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే, కేబీఆర్ పార్క్ ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పెంచే అంశంపై కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Read Also: TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల
మరోవైపు, కారు పార్టీ నుంచి గెలిచిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టడానికి బీఆర్ఎస్ సిద్దం అయింది. తాజాగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అవిశ్వాసంపై చర్చకు వచ్చింది. కాగా, నాలుగేళ్ల వరకు అవిశ్వాసం ప్రవేశ్ పెట్టొద్దని ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ నాలుగేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 11వ తేదీన ముగుస్తుంది.. ఆ తర్వాత తీర్మానం చేసేందుకు బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. అయితే, జీహెచ్ఎంసీలోని 196 సభ్యులలో 50 శాతం మద్దతు కావాలి. ఈ తీర్మానానికి 98 మంది సభ్యుల సంతకాలు చేయాల్సి ఉంది. ఆ తరువాత ఈ తీర్మానాన్ని హైదరాబాద్ కలెక్టర్ కు ఇచ్చి.. ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసి ఆమోదించాల్సి ఉంటుంది.
Read Also: Rashmika Mandanna: రిటైర్‌మెంట్ తీసుకుందాం అనుకుంటున్న.. రష్మిక కామెంట్స్ వైరల్ !
ఇక, ఈ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభిస్తే మేయర్, డిప్యూటీ మేయర్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మందికి గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉండగా.. మరో50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కౌన్సిల్‌లో196 మంది ఉన్నారు. అయితే, బీఆర్ఎస్‌కు 42 మంది కార్పొరేటర్లు, 11 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ ఎంపీలతో కలిపి మొత్తం 62 మంది సభ్యుల సంఖ్య బలం ఉండగా.. ఇటు కాంగ్రెస్ కు కొంత కాలంగా మజ్లిస్ పార్టీతో దోస్తీ పెరిగింది.
Read Also: California Fire: లాస్ ఏంజిల్స్‌లోని శాంటా క్లారిటాలో మంటలు.. ఇళ్లను వదిలిపెట్టిన 19 వేల మంది ప్రజలు
కాగా, బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎంఐఎం సపోర్టు తమకే ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్నారు. కానీ, మజ్లీస్ కాంగ్రెస్ తో జత కట్టిన విషయాన్ని అధికారికంగా నిరూపించడానికి ఈ తీర్మానం కలిసి వస్తుందని కారు పార్టీ యోచిస్తుంది. అయితే, మరోవైపు, బీజేపీ సైతం అవిశ్వాసానికి మద్దతిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ పాలక వర్గ సమయంతో పాటు ఇతర అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో, హైదరాబాద్ మేయర్ పైన అవిశ్వాసం తీర్మానం ఇప్పడు పొలిటికల్ సర్కిల్ లో ఆసక్తికరంగా మారింది.