కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి అనారోగ్యంతో మృతి చెందారు. కేసీఆర్ ఐదవ సోదరి, కేటీఆర్ మేనత్త, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు తల్లి చీటీ సకలమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మేడ్చల్ దగ్గరలోని ఆమె నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40,000 రేషన్…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో వీఎం బంజర్ లో గ్రామసభ జరుగుతుండగా కాంగ్రెస్- బీఆర్ఎస్ నాయకుల మద్య వాగ్వావాదం చోటు చేసుకుంది. అర్హల జాబితాపై తీవ్ర వాగ్వాదం జరిగింది. గత పదిహేను రోజుల క్రితం బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరిన నాయకుడికి కారు పార్టీ నేతకు మధ్య వివాదం చెలరేగింది. ఇద్దరు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు.
Danam Nagender: హైదరాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. పేద ప్రజల జీవన ఆధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారు.
Harish Rao: మంచిర్యాల జిల్లాలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులను ఇంటి పన్నులో జమ చేశారు అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే, తల్లికి వచ్చే వృద్దాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషం అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడి వచ్చేనెల 11కు నాలుగేళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట.
ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా నిర్వహించనుంది. అయితే.. ఈ నెల 21న నల్గొండలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ)న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈరోజు.. ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.