మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు." అని వ్యాఖ్యానించారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. వనపర్తి విద్యార్థిగా…
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందించారు. "ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న మీటింగ్ లో సీఎం నీ.. ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు. దాని మీద…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు.
MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, చిన్న, పరిమితమైన కార్యక్రమాలను జరిపినా వాటిని మొదటి పేజీలో పెద్దగా ప్రచారం చేస్తూ చూపుతున్నందున, ఇతర కీలక విషయాలు పక్కనపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. ఆమె అభిప్రాయం ప్రకారం, రెండో దఫా కులగణనపై సరైన, సమగ్రమైన ప్రచారం జరపకపోవడం వల్ల, మొదటి దశలో గుర్తించబడిన, కూలాంటి కుటుంబాలు సర్వేకి తమ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాయని ఆమె అంటున్నారు. నాగర్కర్నూల్లో తెలంగాణ…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావు, వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పర్శరాములుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఏ-2గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్…
Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని అందరూ చూడటానికి ప్రభుత్వం…
TPCC Mahesh Goud : ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, మాజీ మంత్రులుగా కనీస మినహాయింపు లేకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం సిగ్గుచేటని టిడిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులమడం అలవాటైపోయిందని, శవాలపై రాజకీయం చేయడం వారి నైజమని ఆయన ధ్వజమెత్తారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 24 గంటల పాటు రిస్క్యూ టీమ్స్…
Etela Rajender : గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారిందని ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవన్నారు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి..వీటిపై చర్చకు వస్తారా రండని, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25…
KTR : తెలంగాణలో ఇటీవల జరుగుతున్న మిస్టీరియస్ మరణాల (Mystery Deaths) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై బోరింగ్ ప్రసంగాలు ఇస్తూ, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర పాలన నిర్వహించే బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని మరిచిపోయి, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. “ఒక ముఖ్యమంత్రి (Chief Minister) లాగా మాట్లాడాలి కానీ,…
తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం…