టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నదాతకు అపార నష్టం వాటిల్లిన తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థుల బతుకులు సర్వ నాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారు.. సంపదను కొంతమందికి పంచుతున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన కాలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా రోడ్డు పై కాంగ్రెస్ నిరసన తెలిపారు.
ఆంధ్రావాళ్లు తెలంగాణ పబ్లిక్ కమిషన్ లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ కుటుంబాన్ని జీవన్ రెడ్డి పరామర్శించారు.
తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే మాట్లాడినా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సంజయ్ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు ఇవాల హాజరయ్యారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఇవాల ఉదయం 11 గంటలకు మహిళ కమిషన్ ముందుకు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ హాజరు కానున్నారు.
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. మెడికో ప్రీతి కేసు, ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై నేను గట్టిగా ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్ చేశారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. నాపై ఉన్న తప్పుడు కేసును రీఓపెన్ చేశారు.. అది తప్పుడు కేసు అంటూ గతంలో ఖండించిన కేసీఆర్.. ఇప్పుడు కుట్ర చేస్తున్నారు.. స్టే ఉన్న మహబూబ్నగర్ కేసును ఓపెన్ చేసి.. నన్ను మహబూబ్నగర్ పంపి.. మా అన్నయ్యను చంపిన టీమ్…
రోడ్డు మీద సిగ్నల్ దగ్గర కూడా సెల్ఫీలు దిగుతా అయితే తనతో నాకు సంబందం ఉందట అఖల్ వుండాలని అనడానికైనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.