బీఆర్ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లోహా నియోజకవర్గంలోని నాందేడ్‌లో నిర్వహించే ఈ సభకు ఎక్కువ మంది హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి సాయి భగీరథపై వివాదం మరింత వేడెక్కింది. తోటి విద్యార్థులను దూషించి కొడుతున్న రెండు వీడియోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం రేగింది.
ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తామని, కేసులు, జైళ్లు మాకు కొత్త కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది.