Off The Record: భూమా మౌనిక రాజకీయాల్లోకి వెళ్తే మద్దతిస్తానని అన్నారు ఆమె భర్త.. హీరో మంచు మనోజ్. ఆ స్టేట్మెంట్ తర్వాత మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా.. ఎన్నికల్లో పోటీ చేస్తారా… అనే ఆరాలు మొదలయ్యాయి. భర్త సపోర్ట్తో మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత హీరో మంచు మనోజ్.. భూమా మౌనికారెడ్డిలు ఆ సంతోష క్షణాలను ఆస్వాదిస్తుంటే.. తిరుమలలో మనోజ్…
ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల వెనుక బిజెపి కక్షసాధింపు ఏమీ లేదన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లే అధికారంలో వచ్చింది మొదలు అందరిపై కక్షసాధింపుకు దిగిన బిఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి అందరూ అలాగే చేస్తారని అనిపిస్తున్నట్లుందని అన్నారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు,…
శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
CM KCR Key Meeting: ఎల్లుండి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో.. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ కార్యకలాపాలతో…