Revanth Reddy: వంద కోట్ల ఇస్తే.. కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా ? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. TSPSC పేపర్ లీకేజీ పై ఈడీ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పిర్యాదు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ను అవినీతి పరులకు అడ్డగా మార్చింది బిఆర్ఎస్ సర్కార్ అంటూ విరుచుకుపడ్డారు. చైర్మన్ , మెంబర్ ల పై ఎదో ఒక ఆరోపణలు ఉన్నాయని, అనర్హులను సభ్యులుగా నియమించారని మండిపడ్డారు. ఉద్యోగాలు రకా వందలాది మంది చనిపోయిన చనిపోయిన కల్వకుంట్ల కుటుంబానికి చీమకుట్టినట్టైనా కావడం లేదని రేవంత్ ఆరోపణలు గుప్తించారు. ఒకవైపు పేపర్లు లీక్ అవుతుంటే… ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ పై కేసీఆర్… జూబ్లీహిల్స్ లో పార్టీలు చేసుకోవడంపై కేటీఆర్ బిజీగా ఉన్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ ద్వారా నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు.. ఇది ఆటవికమైన చర్య అంటూ మండిపడ్డారు. ప్రశ్న పత్రాలు అమ్ముకున్న వాళ్లను, కోట్ల రూపాయలు కొల్లగొట్టిని వాళ్ళను అరెస్ట్ చేయాలని ఆలోచన తెలంగాణ సర్కార్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Jennifer Aniston: జెన్నీఫర్ ఆనిస్టన్… ప్రమాదకరమా!?
శంకర్ లక్ష్మి నీ విట్ నెస్ గా మార్చింది సిట్ అని తెలిపారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. అందుకే సిట్ ద్వారా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కింది స్థాయి వాళ్లను బలి పశువులు చేసి కేసును మూసి వేయాలని సర్కార్ ఆలోచన చేస్తుందని, పేపర్ లీకేజీ కేసులో ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. పేపర్లు అమ్మి డబ్బులు తీసుకున్న వాళ్లు ఇతర దేశాలకు హవాలా రూపంలో డబ్బులు పంపారని ఆరోపణలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరం ఏదైనా ఈడీ విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.
Read also: Bhatti vikramarka: బెల్లంపల్లి లో పీజీ కాలేజ్ ఏర్పాటు చేయండి.. భట్టికి విద్యార్థుల వినతి పత్రం
ఐటీ మంత్రి కేటీఆర్ మొదలు పబ్లిక్ సర్వీసు కమిషన్ లో ఉన్న చిన్న స్థాయి ఉద్యోగి వరకు ఈడి విచరించాలి, ఈడి సిట్ నుంచి అన్ని ఆధారాలు తీసుకుని విచారణ చేయాలని కోరామన్నారు. పబ్లిక్ డొమైన్ లో లేని సమాచారం కేటీఆర్ వద్దకు ఎలా వచ్చింది ? ప్రశ్నించారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కేటీఆర్ ఎలా తెలుస్తోంది ? కటాఫ్ మార్కులు ఎన్ని అనేది కేటీఆర్ కు ఎలా తెలుస్తోంది? కేటీఆర్ కు పేపర్ దొంగలు సమాచారం ఇచ్చారా మరి ? కేటీఆర్ ఏమి చెబుతున్నారో సిట్ అదే చేస్తుంది అని ఆరోపించారు. అసలు కేటీఆర్ కు పరువు ఉందా ? లేదా తేలాలి ? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పరువును నడి బజారులో అమ్మిన సన్నాసి కేటీఆర్ నాకు నోటీసు ఇస్తాడా ,? కీలక వ్యాఖ్యలు చేశారు. వంద కోట్ల ఇస్తే …కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా ? అంటూ వ్యంగాస్త్రం వేశారు. కేటీఆర్ నీచుడు … సన్నాసి …నాకు నోటీసు ఇచ్చేది ఎంది ? దమ్ముంటే పేపర్ లీకు కేసు ను సిబిఐకి ,ఈడి కి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Jennifer Aniston: జెన్నీఫర్ ఆనిస్టన్… ప్రమాదకరమా!?