Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో మాజీ సీఎల్పి నేత జానారెడ్డి పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, నిరుద్యోగులను చూస్తుంటే మా హృదయాలు పరవశిస్తున్నాయని ఆయన అన్నారు.
కేసీఆర్ కూతురు మీద దాడులు చేస్తున్న బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది అని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ని పర్యటనలు చేసిన ఆశించిన స్థాయిలో బీజేపీలో చేరికలు లేవు అని విమర్శించారు.
Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఇప్పుడు ఇదే తరహా పోరాటం మొదలైందట. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొడుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోందట. సిట్టింగ్లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కొన్ని చోట్ల గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోందట బీఆర్ఎస్. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారట. మంత్రి…
KTR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పు సాధించేందుకు బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్ఎస్ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రజాప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించే బీఆర్ఎస్ ఈ ఏడాది సాధారణ సమావేశానికే పరిమితం చేయాలని నిర్ణయించింది.