Nama Nageswara Rao: అనుభవంతో చెబుతున్నా.. మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nama Nageswara Rao: మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు నాకున్న అనుభవంతో చెబుతున్నానని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డిని గతం లో నాకు వచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ అయిదారు నెల్లు చిన్న చిన్న మనసు మనస్పర్ధలు ఉన్న పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలిని పిలుపు నిచ్చారు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మాయమాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జిల్లాలో గతంలో కొంతమంది మోసం చేశారన్నారు. మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు నాకున్న అనుభవంతో చెబుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రానున్న ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో మేమిద్దరం గాడి ఎడ్లలా పని చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. సొసైటీలను లాభాల బాట పట్టాలన్నారు. మండలంలోని చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభం, ముత్యాలమ్మ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఎంపీ నామా నాగేశ్వరరావు రూ.2,01116, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి రూ.6లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా యాగశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..