తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు.. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంపై బీఆర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ కి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని…
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్కు పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో ఏమాత్రం ఆదరణ తగ్గని విషయం తెలిసిందే. బీజేపీ నేతలు ఇప్పటికీ బండిసంజయ్ ని విపరీతంగా ఆరాధిస్తారు.
Minister KTR: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మతిస్థిమితం లేదని, ఆయన నోట్లో నుంచి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి 100% ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతినీ ప్రశ్నించకుండ ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ మానవ హక్కులు కమిషన్ కమిషనర్ లేకుండా చేశారంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి మా చారిటీ భూములను ఆగం చేశారు.. నన్ను తిట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయన్ ట్రాన్స్ ఫర్ అయ్యాడు అంటూ ఆయన వ్యాఖ్యనించాడు.
Minister KTR: 75 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం చేయనీ విధంగా కేసీఆర్ సర్కార్ చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా లోని 1650 మందికి పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు.
జులై 8న తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఈ సందర్భంగా రూ. 6,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. గౌడవెల్లి గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు 15 యూనిట్ల గొర్రెపిల్లలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేసారు.
కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు.
Gongidi Sunitha: మసీదులు తొవ్వుతా , గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే ఉంటదని బండి సంజయ్ పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాట్ కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని బూర్జుబావి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు.