Ashish Kumar Yadav: సీఎంను కలిసిన ఆశిష్ కుమార్ యాదవ్.. గోషామహల్ సమస్యలపై వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashish Kumar Yadav: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గోషామహల్ బీఆర్ఎస్ నేత ఆశిష్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. శిథిలావస్తకు చేరుకున్న పురాతన కట్టడాలకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా గోషామహల్ అభివృధికి కృషి చేయాలని సీఎంను కోరారు. ఆశిష్ కుమార్ యాదవ్ విన్నపాన్ని విన్న సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గోషామహల్ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం కేసీఆర్ కు ఆశిష్ కుమార్ వివరించారు. అనంతరం పుష్పగుచ్ఛంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: Twitter: ట్విట్టర్ ఏది ఉచితంగా ఇవ్వదు.. అంటునే మస్క్ మళ్లీ ఫిట్టింగ్..!
Also Read
గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మూసి నది నిండి బ్యారేజ్ గేట్లు ఎత్తేసి నీళ్ళు వదిలారు.. మూసి నది పరివాహక ప్రాంతం అయిన గోషామహల్ లోని లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులను సూచించి వారికి దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హల్ లకి తరలించాలని సూచించారు. వారందరికి వసతి, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోని ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆశిష్ కుమార్ యాదవ్ హిమాయత్ నగర్ జిల్లా గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆశిష్ కుమార్ యాదవ్ అంకితభావం, ప్రజా సేవలో నిబద్ధతను చూసిన పార్టీ అధిష్టానం గోషామహల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనుంది. రాజకీయాల పట్ల మక్కువతో అంకితభావం కలిగిన వ్యక్తి అయిన ఆశిష్ కుమార్ యాదవ్ 2006లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIలో చేరినప్పుడు తన కెరీర్‌లో గణనీయమైన పురోగతిని సాధించాడు. ఆశయం, సానుకూల మార్పు తీసుకురావాలనే బలమైన కోరికతో నిండిన ఆశిష్ కుమార్ యాదవ్ NSUIలో అంతర్భాగమయ్యారు. 2007లో ఆశిష్ కుమార్ యాదవ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIకి హైదరాబాద్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సంస్థ అతనికి అప్పగించిన ఈ ముఖ్య బాధ్యతలను అతని నాయకత్వ సామర్థ్యాలు, అంకితభావం, విద్యార్థుల సంక్షేమం, హక్కుల మెరుగుదల కోసం చురుకుగా పనిచేసిన నిరూపితమైన ట్రాక్ తనక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Rains And Floods: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు
తాజావార్తలు
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..