సింగరేణి వేతన బకాయిలు 23 నెలలుగా పెండింగ్లో ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కోల్ ఇండియా ఇప్పటికే ఐదుకు సంబంధించిన జీవో కూడా ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
స్టేషన్ ఘన్పూర్లో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్నట్లుగా పరిస్ధితి మారిందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో అందరికీ తెలుసునని.. మేం చేసిన పనులను తామే చేశామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్ధితి నెలకొందని మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో 4 వేల కోట్ల ఇందిరమ్మ ఇంటి పెండింగ్ బిల్లులను కట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ రుణన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.25 వేలు చెల్లించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని తెలిపారు.
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసేందుకు వెళ్తున్న కామారెడ్డి బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఏడు గంటల పాటు పోలీస్ వ్యానుల్లో తిప్పి బిచుకుంద పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటుజహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ చాలా మందితో మాట్లాడారు.. వారందరూ పార్టీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు.
Ponguleti-Tummala: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Koppula Eshwar: కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దేశంలో 40 కోట్లకు పైగా దళితులు, గిరిజనులున్నారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు ద్రోహం చేసిందన్నారు.
Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే కొన్ని పార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తాయని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇస్తాయి కానీ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
Komatireddy venlat reddy: మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఈ నెల రోజులు అయిన 24 గంటల కరెంట్ ఇవ్వండి కేసీఆర్ గారు అంటూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.