ఏపీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్‌లో అవే చెబుతున్నాయని ఆయన చెప్పారు. తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్ రెండోసారి సీఎం అవుతారన్నారు.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.
BRS Candle Rally: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
బీజేపీ మిత్రపక్షం అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే.. సీబీఐ విచారణ కోరుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
Telangana BJP: నేడు ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది.
జయ జయహే తెలంగాణ గీతంపై కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్నారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.