Huzurabad: హుజూరాబాద్ లో హైటెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు.. ప్రతి సవాళ్లు
- గతం లో ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు
- స్పందించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రణవ్
- హుజురాబాద్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు ఆరోపించిన ప్రణవ్
- ఆంజనేయుని పై ప్రమాణం చేస్తావా అని సవాల్
- సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. గతం లో ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రణవ్ ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు, రైస్ మిల్లర్లు, ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశాడని, పూర్తి ఆధారాలతో చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి వస్తున్నానని, నీకు ధైర్యం ఉంటే నీవు కూడా వచ్చి డబ్బులు తీసుకోలేదని ఆంజనేయుని పై ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు విసిరిన సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి.. ఇవాళ చేల్పూర్ హనుమాన్ దేవాలయానికి రానున్నారు.
READ MORE: Credit Card : ఉద్యోగం, ఇన్ కం ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందవచ్చా ?
Also Read
ఈ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి బిఅర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటి నుంచి హుజురాబాద్‌లో ప్రణవ్, కౌశిక్ మధ్య వార్ నడుస్తోంది. ఇప్పుడు ప్రణవ్‌కు మంత్రి పొన్నం అండ పుష్కలంగా ఉంది. కౌశిక్‌కు కెప్టెన్ వర్గం అండ దండలు ఉన్నాయి. దీంతో వీరి మధ్య రాజకీయ ఆధిపత్యం కోసం పోరాటం నడుస్తుంది. తాజాగా పొన్నంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటుగా ప్రణవ్ బాబు కౌంటర్ ఛాలెంజ్ చేయడం, ఇద్దరు చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదిక చేసుకోవడంతో ఈ రోజు 11 గంటలకు అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. పోలీసులు ముందుగానే చెల్పూర్‌కు వెళ్లి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!