Graduate MLC Bypoll: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వచ్చాయని, బీఆర్ఎస్.. బీజేపీ అధర్మ యుద్ధానికి తెర లేపినా మా బలం పెరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ సీటు కూడా గెలిచామని, ప్రజల కోసం పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. బీజేపీ నేతలు నోరుంది కదా అని నోరు పారేసుకోవద్దని, బీజేపీ ది బలుపు కాదు వాపు అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని,…
కేంద్రమంత్రి రేసులో ఉన్నారా అని ప్రశ్నపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రధానమంత్రి ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తాని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ రేసులో ఉండను.. ఎవరికీ ఎం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వచ్చాయన్న వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్.. రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కి చావు తప్పి…
బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఏడు చోట్ల బీజేపీని గెలిపీయించింది బీఆర్ఎస్.. వారి ఆత్మబలిదానాలు చేసి అవయవ దానం చేసింది బీజేపీకి.. నేను ఎన్నికలో ఇదే ఆరోపణ చేస్తే బీఆర్ఎస్ నాతో వితండవాదం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రాన్ని ఏలిన కె.చంద్రశేఖర్ రావు ఇంటి బాట పడుతున్నారు. అయితే.. భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. కనీసం ఆధిక్యం దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్కు చెందిన నేతలు రాకపోవడం గమనార్హం. తెలంగాణలో ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఒక్కొక్కటి ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన సీటు,…
ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నం.. కేరళ వ్యక్తి అరెస్ట్ ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే.. తాజాగా ఒక ప్యాసింజర్ ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి అరెస్ట్ పాలయ్యాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు రచ్చ…
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించిందని.. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. "ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ.
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
BJP MP Dr K Laxman Talks About Telangana Formation Day: తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) అని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని బీజేపీ ఎంపీ లక్షణ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ కోసం ఉద్యమం చేసిందని, పార్లమెంట్లో గళం విప్పిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ద్వందనీతి అవలంభించిందని లక్షణ్ విమర్శించారు.…