KTR Tweet: రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోడీ, అదానీ స్నేహితులంటూ టీ షర్టులు ధరించి నిరసన తెలుపుతున్నారు. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. డియర్ రాహుల్ గాంధీ.. ఇది ఎలాంటి ద్వంద్వ వైఖరి అన్ని కేటీఆర్ ప్రశ్నించారు.
Read also: AP Capital Amaravati: రాజధాని నిర్మాణం ఇక చకచకా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మీరు పార్లమెంటులో అదానీ-మోడీ బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించడం సరైనదే అయితే, మరి మేము అసెంబ్లీలో అదాని-రేవంత్ ఫోటోలతో వెళతామంటే ఎందుకు అనుమంతిచలేదు అని అన్నారు. ఈ ఘటనపై రాహుల్ స్పందించాలని, దయచేసి చెప్పాలని రాహుల్, కేటీఆర్ లు.. టీషర్ట్ ధరించిన వున్న ఫోటోలను తన ఎక్స్ లో షేర్ చేశారు. మీరు చేస్తే న్యాయం.. మేము చేస్తే అరెస్టులా? అని మండిపడ్డారు. మీరు చేసిందే కదా.. మేము చేశాము.. అందులో తప్పేముంది? అని ట్వీట్ చేశారు.
Read also: Ntv Exclusive : మోహన్ బాబు పని మనిషి బయటపెట్టిన పచ్చి నిజాలు
కాగా.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. అదానీ, రేవంత్ మధ్య ఉన్న చీకటి అనుబంధాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్ చిత్రాలను ముద్రించిన టీ షర్టులు ధరించి వెళ్లగా.. పోలీసులు లోపలికి వెళ్లడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కు మాకు లేదా? అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులను ప్రశ్నించారు. అయినా అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
INDIA bloc Rift widens: భారత కూటమిలో చీలిక.. మమతాకి నాయకత్వం అప్పగించాలని డిమాండ్