KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు. రాకేష్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పార్టీ కేటీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇల్లెందు పట్టణానికి చేరుకుంటారు. జేకే గ్రౌండ్స్‌లో పట్టభద్రులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్‌కు చేరుకుంటారు. గ్రాడ్యుయేట్లతో కూడా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలకు చేరుకుని.. కళాశాల ఆవరణలో గ్రాడ్యుయేట్లతో సమావేశానికి హాజరుకానున్నారు.బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాత్రం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Read also: Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. సర్వదర్శనానికి 16 గంటల సమయం..
మరోవైపు శాసనమండలి ఎన్నికలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి జిల్లాలోని మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం పార్టీ నేతలంతా ఇప్పటికే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి రాకేష్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వావిరాజు రవిచంద్ర, బీఆర్ ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయనున్నారు.
Sammakka Sarakka: సమ్మక్క, సారలమ్మ దర్శనం నిలిపివేత..?