KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో, గ్రామానికి సర్పంచ్ కూడా అలానే ఉంటారని కేటీఆర్ అన్నారు. సర్పంచులు ఎవరి కింద పనిచేసేవారు కాదని, వారు సర్వస్వతంత్రులని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని, వారి చేతిలో ఏమీ ఉండదని…