Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిస్తే.. నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదని, తెలంగాణ ప్రజలు అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదన్నారు. సెంటిమెంటు మీద ఆధారపడి ఎల్లకాలం రాజకీయాలు నడవవన్నారు. 2015లోనే ఫోన్ ట్యాపింగ్‌పై చర్చ జరిగిందన్నారు.
Thummala Nageswara Rao:తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
BRS Meeting: నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు.
నేడు తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కుంభకోణం జరుగుతుంది. రూ. 1450 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందుకు సంబంధించి తాను రెండు రోజుల్లో ఈడికీ, సీబీఐకీ పిర్యాదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్తీక దీపం సీరియల్ లాగ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తోందని.. తెలంగాణ రాష్ట్రంలో ‘ఆర్ఆర్’ కుంభకోణం జరుగుతుందని మాట్లాడారు. ఇక ‘ఆర్ఆర్’ అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పుకొచ్చారు.…
రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. రోస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ ఇవాళ ఉదయం తీర్పు వెలువరించింది.
విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.