బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారు అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహ గర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచే ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
జీవో-3 పై కవిత మహిళాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్- 1 నోటిఫికేషన్ పై ఇచ్చిన మెమో మీరు ఇచ్చారు.. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేని మీరు.. ఇప్పుడు మట్లాడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గట్టి షాక్ ఇచ్చారు. ఈ రోజు తెలంగాణ భనవ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి ఆయన డుమ్మా కొట్టాడు.
Ponnam Prabhakar: బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.