Off The Record: గ్రేటర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మధ్య కయ్యాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అధికార బిఆర్ఎస్ లో లుకలుకలు పెరుగుతున్నాయని కేడర్ కోడై కూస్తోంది. BRS పార్టీ ఎమ్మెల్యేలకు…ఆ పార్టీ కార్పొరేటర్లకు మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా వుంటోందన్న చర్చ సాగుతోంది. వివిధ రాజకీయ కారణాలతో ఎమ్మెల్యేలకు…కార్పొరేటర్ లకు మధ్య ఎడం చాంతాడంత పెరుగుతోందట. అప్పుడప్పుడు ఆ విబేధాలు బయట పడితే…మరి కొన్ని సందర్భాల్లో లోలోపల కత్తుల దూసుకుంటున్నారన్న మాటలు వినపడ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఫలితాలపై వీరి కోల్డ్ వార్ ఎటువంటి ప్రభావం చూపుతుందన్న టెన్షన్ పైనా అటెన్షన్ మొదలైంది.
గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని చోట్ల సయోధ్య ఉన్నా…మరికొన్ని చోట్ల రాజకీయ విభేదాలు ఎప్పటి కప్పుడు ఏదో ఒక రూపంలో బయట పడుతున్నాయి. జూబ్లీ హిల్స్ , అంబర్ పేట, ఉప్పల్, ఖైరతాబాద్ ,శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయని అధిష్టానానికి సైతం రిపోర్ట్ లు పోతున్నాయట. జూబ్లీహిల్స్, ఉప్పల్, అంబర్ పేట నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ అనేది అందరికీ తెలిసిన విషయమే అని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారంలో ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్ …కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, అంబర్ పేట నియోజక వర్గంలో కాలేరు వెంకటేష్ కు…గోల్నాక కార్పొరేటర్ కు…..ఉప్పల్ లో MLA సుభాష్ రెడ్డికి చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవికి మధ్య పచ్చ గడ్డి వేసినా, వెయ్యకున్నా ఎప్పటికప్పుడు భగ్గుమంటోంది.
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
గ్రేటర్ హైదరాబాద్ ఏ పార్టీకైనా అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలు గెల్చుకునే పార్టీకే అధికార పగ్గాలు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య వుంటేనే, ఫలితాలు ఆశాజనకం. కానీ గ్రేటర్ పరిధిలోని పార్టీ నేతల్లో రోజుకో రచ్చ బయటపడితే, మొదటికే మోసమని పార్టీ నేతలంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య గ్యాప్ ను తగ్గించాలని పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారు. చూడాలి, పార్టీ నాయకుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలితమిస్తాయో…
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!