తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకం అమలులో కొంతమంది ఎమ్మెల్యేలు మూడు లక్షల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల అవినీతిని ప్రోత్సహిస్తున్నాడా?.. ఎమ్మెల్యే ల అవినీతి చిట్టా తన దగ్గర ఉంది అన్న సీఎం తన ప్రభుత్వంలో అవినీతిపరులు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా..! వారిపై చర్యలు తీసుకోకుండా వారిని ప్రోత్సహిస్తున్నాడా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఎంత మంది లబ్ధిదారులకు దళిత బంధు ఇచ్చారు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : Saidharam Tej: ‘విరూపాక్ష’ అదర్ లాంగ్వేజెస్ హక్కులు ఎవరికంటే….
ఏసీబీ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధులపై చర్యలేవీ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. రాజయ్యపై ఆరోపణ వస్తేనే ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారని మండిపడ్డారు. దళిత జాతిని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి చేస్తే అడ్డంగా నరకుతా అన్న కేసీఆర్ కు ఎవరు అడ్డొస్తున్నారని అడిగారు. ఎమ్మెల్యేల తాట తీయడానికి కేసీఆర్ కు భయమెందుకు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : Supreme Court: హంతకులకు ఎలా తెలిసింది..? అతిక్ అహ్మద్ హత్య కేసులో యూపీ ప్రభుత్వానికి ప్రశ్నలు..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన తనయుడు రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ తనయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిస్తే టికెట్ ఇస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు జీవన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాజకీయం అనేది ఇస్తే వచ్చేది కాదన్నారు. కేటీఆర్, కవితకు కూడా అవకాశం ఇస్తే వచ్చింది కాదని తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ వారిరువురూ కూడా ఇంటలిజెంట్ అని ఆ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.