నేతల చేరికలపై కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారా ? ఎవరొచ్చినా వద్దొనద్దని ఇంచార్జీ మంత్రి అంటుంటే…కబ్జాదారులు, బ్లాక్ మెయిలర్లను చేర్చుకోబోమని ఎందుకంటున్నారు ? మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరికలపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? లోకల్ క్యాడర్ వద్దంటుంటే… హైకమాండ్ ఎస్ అంటదా ? ఇంతకీ ఆయన చేరిక ఉన్నట్టా..లేనట్టా..? కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు…
KCR: నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. నేడు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడివైతే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చెయ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటిఆర్ మాట్లాడ్డం ఆయన రాజకీయ అవివేకానికి నిదర్శనం అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్‌ఎస్ బహిరంగసభ నిర్వహిస్తుంది.
Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారిందన్నారు.
గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ఇక, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు.
నిజామాబాద్- జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో ప్రజా పాలన దరఖాస్తుల పనితీరును మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. దరఖాస్తు కేంద్రాల్లో అధికారులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తోందని, ప్రజా స్పందన చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు 420 బుక్ లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో…
Shiva Sena Reddy: రానున్న రోజుల్లో నోరు అదుపులో పెట్టుకోకుంటే తెలంగాణాలో మహిళలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్న దమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి గిరిజనుడి మృతికి కారణం అయ్యారు..
Bhatti Vikramarka: పాత్రికేయుల సమస్యలపై కూడా పోరాడుతామని, పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ కు ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.