Off The Record : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు దిగేస్తున్న బీఆర్ఎస్ నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేతల చేరికలపై కాంగ్రెస్ నేతలు తలో మాట మాట్లాడుతున్నారా ? ఎవరొచ్చినా వద్దొనద్దని ఇంచార్జీ మంత్రి అంటుంటే…కబ్జాదారులు, బ్లాక్ మెయిలర్లను చేర్చుకోబోమని ఎందుకంటున్నారు ? మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరికలపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ? లోకల్ క్యాడర్ వద్దంటుంటే… హైకమాండ్ ఎస్ అంటదా ? ఇంతకీ ఆయన చేరిక ఉన్నట్టా..లేనట్టా..? కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పేసుకున్నారు. మరో వైపు నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలంతా పార్టీ మారారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన పార్టీలోకి రావడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వద్దంటే వద్దంటూ ధర్నాలు చేశారు. మంత్రి సీతక్క సమావేశాల్లో సైతం మాజీ మంత్రిని తీసుకొవద్దని డిమాండ్ చేశారు. పార్టీ జెండా మోసిన లీడర్లు…జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు…ఎన్నికల సమాయత్తంపై సమావేశాలు నిర్వహించారు. అక్రమార్కులు, పార్టీని నష్టపర్చే విధంగా పని చేసిన ఇతర నేతలను తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారట. అయితే అదే సమయంలో సీతక్క…చేరికలు వద్దనొద్దని, ఎవరు వస్తే వారిని తీసుకోవాలని కుండబద్దలు కొట్టారట. నిర్మల్‌లోని కాంగ్రెస్ కేడర్ ఏకతాటిపైకి వచ్చి…ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని ఒత్తిడి చేస్తున్నారట. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవారికి సరైన గుర్తింపు, నామినేటెడ్ పదవులివ్వాలని కోరారట. దీంతో ఇదంతా ఎటో దారి తీస్తుందని అనుకున్నారా ఏమో కానీ…బ్లాక్ మెయిలర్లను, చెరువు కబ్జాదారులను చేర్చుకోబోమని వెడ్మ బొజ్జు స్పష్టంగా చెప్పేశారట. ఆ వ్యాఖ్యలు మాజీ మంత్రిని ఉద్దేశించి చేసినవనే టాక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మీరు బలంగా ఉంటే పక్కోళ్లు ఎందుకు తీసుకుంటామని మంత్రి సీతక్క పార్టీ నేతలకు స్పష్టం చేశారట. పార్టీ బలోపేతం, ఎంపీ సీటు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. మంత్రి మాటలు ఒక విధంగా ఉంటే…ఎమ్మెల్యే బొజ్జు మరో అర్థం వచ్చేలా ఉండడంతో కేడర్‌లో గందరగోళం నెలకొందట. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలు మాజీ మంత్రి వద్దంటే వద్దని వాదిస్తున్నట్లు సమాచారం. ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కప్పేసుకుందామనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఓ దఫా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయినట్లు తెలుస్తోంది. హస్తం పార్టీలో చేరడం కోసం మాజీ మంత్రి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే…ఇదిగో అదిగో చేరిక అంటూ ఆయన అనుచరులు లీకులిస్తున్నారు. వీటన్నింటిన చూస్తున్న నిర్మల్ కాంగ్రెస్ నేతలు…అలాంటి వారిని తీసుకోవడం పార్టీకి నష్టం జరగుతుందని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారట. ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలవాలంటే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగా ఉండాలని హైకమాండ్ భావిస్తోంది. అక్రమార్కులు, అవినీతి పరులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అహంకారంగా వ్యవహరించి…పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారినెలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకుంటే ఒకటి..లేదంటే మరోటి అన్నట్టుగా పార్టీకి…ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైందట.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, నిర్మల్ జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు మాటల్లో తేడాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యాఖ్యలను కంట్రోల్ చేసేందుకు….ఇంద్రకరణ్ రెడ్డిని రాకను సీతక్క, ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ హైకమాండ్ ఏం చెబితే అదే చేద్దామని చెప్పడంలో ఆంతర్యమేంటని కేడల్‌లో చర్చ సాగుతోంది. తనకున్న రాజకీయ పలుకుబడి, బంధువర్గం, రెడ్డి సామాజికవర్గం నేతలతో మంతనాలు జరిపి పార్టీలో చేరితే మాత్రం…పార్టీ కోసం పని చేసి ఇన్నాళ్ల జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రకరణ్ రెడ్డి చేరిక ఉంటుందా ? ఉండదా ? అనేది సందిగ్దంగా మారింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!