సింగరేణి ప్రైవేటీకరణకు అడుగు వేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని తెలంగాన కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అప్పుడు మద్దతు తెలిపి ఇప్పుడు పోరాటం చేస్తామంటే ఎలా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వెలిగిపోతుందని, 24 గంటల ఉచిత కరెంటు మా ప్రభుత్వం వల్లనే వస్తుందని గొప్పలు చెబుతున్న కేసీఆర్ తొమ్మిదేళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టిన పవర్ ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆయన అన్నారు.
State Planning Commission: స్థానిక సంస్థల రాష్ట్ర వ్యాప్త మాజీ ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే ‘పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు.
Rythu Bandhu : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తీసుకొచ్చింది. నేడు వారి కోసం మరో రూ.550కోట్ల నిధులు విడుదల చేసింది. రైతు బంధు పథకంలో భాగంగా తెలంగాణ రైతులకు మంగళవారం మరో రూ.550.14 కోట్లు విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.