ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమీపంలో సిలిండర్లు పేలడంతో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు.