ఆస్తుల కోసం తోబుట్టువులను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ అన్న తన చెల్లెలి కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన దుర్గారావు తన చెల్లి కోసం హస్తిన బాట పట్టాడు. తన సోదరి నవ్యతను చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018లో పెళ్లి చేశాడు. కట్నంగా 23 లక్షల డబ్బు బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు.…