చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత ఆటగాడు కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. గుర్రపు స్వారీ డ్రెస్సేజ్ (వ్యక్తిగత) ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి ఈ పతకాన్ని సాధించాడు.
National Games: అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌లోని వడోదరకు చెందిన 10ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మల్లఖంబ్ క్రీడల్లో బాలుడి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శౌర్యజిత్ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో…
Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. నాలుగో రోజున మూడు మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. ఓ రజతం సహా రెండు కాంస్యాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. మహిళల జూడో 48 కేజీల విభాగంలో సుశీలా దేవి రజతం కైవసం చేసుకుంది. అటు పురుషుల జూడో 60 కేజీల విభాగంలో విజయ్ కుమార్ యాదవ్, వెయిట్ లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ కాంస్య పతకాలను దక్కించుకున్నారు. దీంతో…
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో గురురాజ్ పుజారీ కాంస్యం సాధించాడు. ఈ పోటీల్లో గురురాజ్ పుజారీ 269 కిలోలను ఎత్తి కాంస్యం గెలుచుకున్నాడు. భారత వెయిట్‌లిఫ్టర్ గురురాజ్ తన మొదటి స్నాచ్ ప్రయత్నంలో 114 కేజీలు, రెండోసారి 118 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో గురురాజ్ మూడో ప్రయత్నంలో 151 కిలోల లిఫ్ట్‌తో తన పతకాన్ని ముగించాడు.…
ఒలింపిక్స్‌లో యువ గోల్ఫర్ అదితి అశోక్…అద్భుత ప్రదర్శన చేసింది. ఒకే ఒక్క స్ట్రోక్‌తో పతకాన్ని అందుకునే ఛాన్స్ మిస్సయింది. అంచనాలకు మించి రాణించిందంటూ…ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఒక్క బర్డీ అదితికి కలిసొచ్చి ఉంటే…ఆమె సరికొత్త చరిత్ర సృష్టించేది. పోడియం ఎక్కలేకపోయినందుకు బాధగా ఉందని వాపోయింది అదితి. భారత గోల్ఫర్, యువ క్రీడాకారిణి అదితి అశోక్‌కు ఒలింపిక్స్‌లో…తృటిలో మెడల్ మిస్సయింది. తొలి నుంచి అద్భుత ప్రదర్శన చేసిన అదితి…చివరి రౌండ్‌లో తడబడింది. దీంతో పతకం అందుకునే అవకాశాన్ని కోల్పోయింది. గోల్ఫ్…
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు రెండో మెడల్ వచ్చింది. భారత క్రీడాకారిణి పీవీ సింధూ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించింది వరుస ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. అయితే నిన్న సెమీస్‌లో చైనా ప్లేయర్ తైజుయింగ్ చేతిలో ఓడిన సింధూ.. ఇవాళ మరో చైనీస్ క్రీడాకారిణి బింగ్జియావోతో తలపడింది. ఈ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ కాంస్య పతక పోరులో బింగ్జియావో ను 21-13, 21-15 తో వరుస సెట్లలో ఓడించి…