పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల -60 కేజీల J1 విభాగంలో జూడోకా కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. బ్రెజిల్‌కు చెందిన ఎలియెల్టన్ డి ఒలివెరాను ఇప్పన్ను కపిల్ పర్మా్ర్ ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. తాజా పతకంతో పతకాల సంఖ్య 25కి చేరింది. అందులో.. ఐదు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి.
పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఆదివారం భారత ఆటగాళ్లు రెండు పతకాలు సాధించారు. భారత్‌కు హైజంప్‌లో ఒక పతకం, స్ప్రింట్‌లో ఒక పతకం లభించింది. దీంతో.. భారత్‌కు పతకాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో.. సచిన్ టెండూల్కర్ స్పందిచారు. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన.. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రశంసించారు.
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.
భారత ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్‌లో తొలిసారిగా మెడల్ సాధించిన తొలి ఇండియన్ ఫెన్సర్‌గా భవానీ చరిత్రకెక్కింది. చైనాలో జరిగిన ఈ పోటీలో మహిళల సాబెర్ విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుపొందింది. సోమవారం హోరాహోరీగా సాగిన సెమీస్ లో భవాని 14-15 తేడాతో జేనబ్ దాయిబెకోవా(ఉబ్బెకిస్తాన్) చేతిలో పోరాడి ఓడింది.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖారా మరో పతకాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు.. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని అందుకుని.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇప్పుడు మరో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.. ఇవాళ జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు అవని లేఖారా.. దీంతో.. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు…
పారాలింపిక్స్ లో వరుస పతకాలు సాధిస్తున్నారు భారత అథ్లెట్లు. ఈరోజు ఇప్పటికే మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. నేటి పథకాల వేటను ద్వారణంతో ప్రారంభించింది ‘అవని లేఖరా’. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ గెలిచింది. అనంతరం పురుషుల డిస్క్ త్రో లో రజత పతకం సాధించాడు భారత అథ్లెట్ యోగేష్. 44.38 మీటర్ల దూరం డిస్క్ ను విసిరి ఈ సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పురుషుల…
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పథకం వచ్చి చేరింది. రెజ్లింగ్ లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో ఈ పథకం కైవసం చేసుకున్నాడు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన భజరంగ్ నేడు కాంస్య పథకం మ్యాచ్ లో కజికిస్థాన్ కు చెందిన జైకోవ్ పై ఘన విజయం సాధించాడు. జైకోవ్ పై భజరంగ్ 8-0 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దీంతో…