India Russia: ప్రధాని నరేంద్రమోడీ 16వ బ్రిక్స్ సమ్మిట్ కోసం రష్యా వెళ్లారు. ఈ రోజు ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. మాస్కో-న్యూఢిల్లీ సంబంధాలు చాలా ‘‘ప్రత్యేమైనవి, విశేషమైనవి’’, డైనమిక్‌గా అభివృద్ధి చెందాయని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు మోడీకి నవ్వు తెప్పించింది. ‘‘రెండు దేశాల మధ్య గట్టి సంబంధాలు ఉన్నాయి. అనువాదం లేకుండా తన వ్యాఖ్యల్ని ప్రధానిమోడీ అర్థం చేసుకుంటారు’’ అని రష్యా అధ్యక్షుడు…
BRICS Summit: 16వ బ్రిక్స్ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యాకు వెళ్లారు. రష్యాలోని కజాన్‌లో సమావేశం జరగుతుంది. రష్యాకి చేరిన ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ భేటీ అయ్యారు.
PM Modi Russia visit: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లబోతున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హజరయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 22-23 తేదీల్లో కాజాన్‌లో జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాలో పర్యటించనున్నారు. కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీ బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో భేటీ కానున్నారు.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న నిరంతర దాడులపై భారత్ తొలిసారిగా తీవ్ర విమర్శలు చేసింది. సోమవారం రష్యాలో జరిగిన సమావేశం తర్వాత బ్రిక్స్ దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పాలస్తీనాలో అధ్వాన్నమైన పరిస్థితి, ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. భారతదేశం-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యా్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు సమీక్షించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ఒకరితో ఒకరు భేటీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతలు జోహన్నెస్‌బర్గ్‌లో వేదికను పంచుకున్నప్పుడు ఇద్దరు నేతలు పక్కపక్కనే నడుస్తూ కొద్దిసేపు సంభాషించుకోవడం గురువారం కనిపించింది.
డిజిటల్ లావాదేవీలు భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాన మంత్రి బుధవారం మాట్లాడారు.