భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి (DBO) సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, మానవ హక్కుల రక్షణకు భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్య దేశాలు ఆమోదించాయి. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని ఈ తీర్మానం ద్వారా నిర్ణయించారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల…