Jagga Reddy : ఊహల బడ్జెట్ కేసీఆర్ ది… వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది
- బడ్జెట్ పై కేసీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్
- కేసీఆర్ ది హైప్ బడ్జెట్.. కాంగ్రెస్ బడ్జెట్ ప్రాక్టికల్ అన్న జగ్గారెడ్డి
- కేసీఆర్ బడ్జెట్ దావతికి పోతే మటన్ బిర్యాని తిని రావచ్చు అన్నట్టు అని సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊహల బడ్జెట్ కేసీఆర్ ది… వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద.. రేవంత్…భట్టి లది అభివృద్ధి ఆలోచన అని అన్నారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని, 10 వేల కోట్లతో హైద్రాబాద్ దశ మారుతుంది… కేసీఆర్ కి ఎందుకు కుళ్ళు అని ఆయన మండిపడ్డారు. చీల్చుడు లో మేమే ఎక్స్పర్ట్.. కేసీఆర్ కాదని, మాదగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్ కి ఛీల్చుడు ఏం తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్… భట్టి లు పెట్టింది మంచి బడ్జెట్ ఇది అని, కేసీఆర్ ఇస్ట్మాన్ కలర్ బడ్జెట్ అన్నారని, కేసీఆర్ ది హైప్ బడ్జెట్.. కాంగ్రెస్ బడ్జెట్ ప్రాక్టికల్ అని జగ్గారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ బడ్జెట్..ఊహల బడ్జెట్ అని, కాంగ్రెస్ ది వాస్తవ బడ్జెట్ అని, ఊహలకు… వాస్తవానికి తేడా ఉందన్నారు జగ్గారెడ్డి. భట్టి బడ్జెట్ బిందల్లో నీళ్లు ముంచుకుని తాగినట్టు ఉందని, కేసీఆర్ బడ్జెట్ చెరువులో నీళ్ళు తెచ్చుకుని తాగినట్టుగా.. మాటకు కట్టుబడి…వాస్తవానికి దగ్గరలో కాంగ్రెస్..కాంగ్రెస్ బడ్జెట్ ఉంటుందన్నారు. ఎవరైనా దావతి ఇస్తే…నాన్ వెజ్ కి ప్రయార్టి ఇస్తామని, కేసీఆర్ బడ్జెట్ ఎట్లా ఉంటది అంటే దావతికి పోతే మటన్ బిర్యాని తిని రావచ్చు అన్నట్టు ఉంటదన్నారు.
Gold Cheating: తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామంటూ మోసం.. ఇద్దరు అరెస్టు..
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
అంతేకాకుండా.. ‘ఊరందరికీ మటన్ బిర్యానీ వండుతున్న అని ప్రచారం చేస్తారు. పొయ్యి.. పొయ్యి మీద గిన్నె లు పెడతారు కానీ మటన్ ఉండదు.. మటన్ ఎప్పుడు వస్తుందో అని మనం ఎదురు చూస్తాం… అక్కడ మటన్ లేదు.. ఏం లేదు. ప్రజలను బడ్జెట్ విషయంలో కేసీఆర్ కూడా అట్లనే మోసం చేశారు. కాంగ్రెస్ ది… పప్పు.. మజ్జిగ.. ఉంది… ఇది ఉంది తృప్తిగా తినండి అని నిజం చెప్పినట్టు ఉంటది. మంచి బడ్జెట్ పెట్టిన సిఎం రేవంత్… డిప్యూటీ సిఎం భట్టి…శ్రీధర్ బాబుకి శుభాకాంక్షలు. ఆరు గ్యారెంటీ లకు సరిపడ నిధులు కేటాయించారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది. హైదరాబాద్ కి 10 వేల కోట్లు మంచి నిర్ణయం. తెలంగాణ కి గుండెకాయ లాంటిది హైదరాబాద్. 10 వేల కోట్లు తో హైదరాబాద్ అభివృద్ధి చేసి… పారిశ్రామిక వేత్తలు విరివిగా రావచ్చు. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది.. కార్మికులు… పరిశ్రమలు అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్ కి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉంది. దేశంలో వ్యాపారస్తులు హైదరాబాద్ కి ప్రాధాన్యత ఇస్తారు. బీఆర్‌ఎస్ ఇలా చేయలేదు…
Bellamkonda Sreenivas: అప్పుడే 10 ఏళ్లు.. అంధులకు సాయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..
హైదరాబాద్ కి మీరు నిధులు పెట్టలేదు.. మేము పెడుతున్నాం. మేము హైదరాబాద్ కి 10 వేల కోట్లు పెడితే కేసీఆర్ కుళ్లుకుంటున్నారు. ఎందుకు అంత కుళ్ళు. కాంగ్రెస్ వేసిన ఫ్లైఓవర్ లకు కేటీఆర్ రిబ్బన్ కట్ చేశారు. కేసీఆర్ ది అప్పులకు ప్రాధాన్యత… అభివృద్ధి ఆలోచన రేవంత్.. భట్టిది. అప్పుల చరిత్ర బీఆర్‌ఎస్‌ది…అభివృద్ధి చరిత్ర కాంగ్రెస్ ది. కేటీఆర్..ప్రతిపక్ష నాయకుడు కాబట్టి..ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్..పొన్నం ఇద్దరు ఆర్టీసీ బస్సులో ఎక్కండి.. ఉచితంగా బస్సు లో మహిళలు వెళ్తున్నారా లేదా అని తెలుస్తుంది. తుమ్మలతో కలిసి రైతుల దగ్గరికి పొండి… రుణాలు మాఫీ ఐతున్నాయా లేదో తెలుసుకోండి. నువ్వు బీఆర్ఎస్ కార్యాలయంలో కూర్చొని.. మేము గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడటం ఎందుకు. భట్టితో కలిసి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుందో లేదో చూడండి. ఉత్తమ్ నీ తీసుకుని 500 సిలిండర్ ఇస్తున్నారో లేదో అడగండి. చీల్చుడు లో మేము ఎక్స్పర్ట్..కేసీఆర్ కాదు. కేసీఆర్ రాజకీయం మా దగ్గర నేర్చుకున్నోడివే. .నీ కంటే ఎక్కువ డైలాగ్ కొట్టే వాళ్ళు మ దగ్గర వంద మంది ఉన్నారు’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?