నిజామాబాద్ జిల్లాలోని బోధన్‌లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అయితే నేడు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతం నేడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్ లో ప్రత్యేక…
Telangana BJP Incharge Tarun Chugh Review Meetings Today and Tomorrow. తెలంగాణలో రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ఎన్నికలకు మందుగానే ప్రజల్లోకి వెళ్లి వాళ్లతో మమేకమవడం కోసం ప్రయత్నలు సాగిస్తున్నాయి. దానికి కేడర్లను, కార్యకర్తలను చైతన్య పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, రేపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన…
అసని తుఫాన్ ముంచుకొస్తున్న. ఈ ఏడాది మొదటి తుఫాన్ ఇది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ప్రజలపై విరుచకుపడేందుకు సిద్ధమైంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు…
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం తలెత్తింది. బోధన్‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా…
మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భూతాల ఉద్యమంలో భూములు పంచితే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని…
Former MLA Eravathri Anil Made Comments on Telangana Congress Leaders. కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంపై గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ విప్ ఈరవర్తి అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసామంటే పార్టీ ఎంత బలంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చునని, రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి…
కార్ల అద్దాలకు అమర్చే బ్లాక్ స్టిక్కర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్ ఏరియాలో బ్లాక్ స్టిక్కర్స్ వేసుకొని వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లతో పాటు బ్లాక్ గ్లాస్‌లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్ స్టిక్కర్లను పోలీసులు తొలగిస్తున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.…
Telangana Congress AICC Secretary N.S. Boseraju made Comments on T Congress Senior Leaders Meeting. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఫోన్ చేసి.. సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్‌కు చెప్పాలన్నారు. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొదని సూచించారు. అంతేకాకుండా సమావేశం రద్దు చేసుకోవాలని, సమావేశం ఏర్పాటు చేస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని ఆయన బోస్ రాజు అన్నారు.…
Chicken Price Hike at Telugu States. చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే.. రోజురోజుకు చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. అలాగే హైదరాబాద్‌లో కూడా ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్ ధర రూ.281కు పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్…
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో ఆమె పార్తివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..…