Snake Bite : విషసర్పాల కోరల్లో విద్యార్థుల ప్రాణాలు.. తప్పెవరిది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Another Student Passes Away for Snake Bite at Keesara BC Hostel.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకుడిగా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలు విగతజీవులుగా దరిచేరుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనను మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరగడం దురదృష్ణకరం. ఇటీవల జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ వసతి గృహంలో అర్ధరాత్రి తమ గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి మరణించాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంతగానో శ్రమించి వారి ప్రాణాలు రక్షించారు. అయితే తాజాగా కీసరలోని బోగరం బీసీ హాస్టల్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
నిన్న రాత్రి కీసరలోని బోగరం బీసీ హస్టల్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థి శివ శంకర్ (13)ను పాము కాటువేయడంతో మృతి చెందాడు. మృతుడి స్వస్థలం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం కొమిశెట్టి పల్లి గ్రామం అని అధికారులు తెలిపారు. అయితే గాంధీ హాస్పిటల్ లో విద్యార్థి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఇలా విద్యార్థులు విషసర్పాల కోరలకు బలవుతుంటే.. ఆ విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అధికారులు, ప్రజాప్రతినిధులకు అర్థం కావడం లేదా అని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!