కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం కోరుట్లపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కోట్లతో 2 లక్షల 70 వేల ఇండ్లను నిర్మించి ఇస్తుందని వెల్లడించారు. దేశంలో…
బెర్త్ ఉన్న రైలు ప్రయాణం ఎంత బాగుంటుందో… బెర్త్ లేకుండా చేసే ప్రయాణం అంతే ఇబ్బందిగా ఉంటుంది. అయితే రైలులో బెర్త్ దొరికినా.. బాలింతలు చట్టిబిడ్డలతో అవస్థలు పడుతుంటారు. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న తల్లులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల కోసం రైల్వే శాఖ సీటును ప్రత్యేకంగా రూపొందించింది. ప్రయాణ సమయంలో తల్లులు పడుతున్న ఇబ్బందులను రైల్వే శాఖ దృష్టిలో పెట్టుకొని రైలులో ప్రత్యేక…
మహబూబాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే మెడికల్ కళాశాలను, నూతన హాస్పిటల్‌కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెల్లడించారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే.. హరీష్‌రావు వెంట మంత్రి ఎర్రబెల్లి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం…
ఖమ్మం జిల్లా వేంసూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ధాన్యం తడవకుండా పట్టాను కప్పుతున్న సమయంలో పిడుగు పాటుకు గురై 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ఆరపోసిన ధాన్యం తడిసిపోతోందని ఆవేదన చెందిన యువ రైతు సాగర్.. ఆ ధాన్యం రాశి వద్దకు వెళ్లి పట్టాను కప్పు తున్న సమయంలో పిడుగు పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సాగర్ వేంసూర్ వెటర్నరీ హాస్పటల్…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ముగింపు సభను తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో బహరింగ సభకు భారీ జన సమీకరణతో సత్తా…
ఈ ఏడాది యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.…
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గేట్ వద్ద టాటా ఏస్, లారీ ఢీ కొన్నాయి. దీంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందగా, ఎల్లారెడ్డి లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే.. మృతులు పిట్లం మండలం చిల్లర్గి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.…
గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (VTG SET-2022 ) ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు లక్షా 34వేల 478 మంది బాలబాలికలు హాజరయ్యారు. గత విద్యా సంవత్సరంలో 74వేల 52మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 90.91% విద్యార్థుల హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48 వేల120 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి.…
ఇటీవల సరూర్ నగర్లో జరిగిన పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు వెలుగులో వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నాగరాజును పథకం ప్రకారమే హత్య పోలీసులు వెల్లడించారు. నాగరాజు మొబైల్లో స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసిన నిందితులు.. నాగరాజు హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేసినట్లు తెలిపారు. నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసినట్లు.. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్‌తో నాగరాజు హత్య చేసినట్లు పోలీసుల పేర్కొన్నారు.…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభ కోసం కాంగ్రెస్ పార్టీ 87కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టారని, ఎప్పుడైనా 70సంవత్సారలలో రైతులకు గిట్టబాటు ధర ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ వాగ్ధానాలు అన్ని వింటే నవ్విస్తుందన్నారు. ఇది కేవలం తెలంగాణ ప్రజలని మోసం చేయడం కోసమేనని, ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు…