బీజేపీ నేతలపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం హరీష్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులకు ఒక శాపం ఉన్నట్టున్నది. నిజం మాట్లాడితే వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుంది. అందుకే వాళ్లు అబద్ధం తప్ప నిజం మాట్లాడరు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న పాలమూరు మీటింగులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి పోయిన్రు.. బీజేపీ మంత్రులకు, బీజేపీ నాయకులకు మధ్య సమన్వయ లోపం…
తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ తరువాత మొదటి సారిగా గాంధీభవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ టూర్‌తో క్యాడర్లో జోష్ వచ్చిందన్నారు. అంతేకాకుండా డిక్లరేషన్ పై…కేటీఆర్ ఎన్నో మాట్లాడారని, కేటీఆర్.. ఓ సారి ఛత్తీస్ ఘడ్ వెళ్ళు .. అక్కడ రైతుల రుణమాఫీ… ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో తెలుసుకో అని ఆయన వ్యాఖ్యానించారు. అడ్డగోలుగా మాట్లాడిన.. బీజేపీ.. టీఆర్ఎస్.. ఎంఐఎం చీకటి కోణం…
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీవీని, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళను ప్రధానినీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడు భట్టిని సీఎల్పీ నేతగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దళితున్ని ఓర్వలేక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర మీదంటూ టీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. రాహుల్ మీద నువ్వు ఏ…
సోమవారం రష్యాలో “విజయ దినం కవాతు” జరగనుంది. “విక్టరీ డే పరేడ్”గా ప్రసిద్ధి గాంచిన ఈ మెగా ఈవెంట్ కు పుతిన్ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. వేలాదిగా సైనికులు, వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, భారీ సైనిక వాహనాలు రాజధాని మాస్కో నడిబొడ్డున రెడ్ స్క్వేర్ గుండా ప్రదర్శనగా సాగిపోనున్నాయి. ఆకాశంలో ఫైటర్ జెట్లు గర్జిస్తుండగా రష్యా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి ప్రదర్శించనుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల నేతలు రాహుల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సింగిల్ విండో చైర్మన్‌గా ఓడిపోయినా… కేసీఆర్‌కి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని, కేసీఆర్.. మొదట ఎమ్మెల్యేగా ఓడిపోలేదా..? అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ రాజకీయ…
పుడ్డింగ్ అండ్ మింకి పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. పబ్ లోపలికి డ్రగ్స్ ఎలా వచ్చాయని దానిపైన పోలీసుల విచారణ దాదాపుగా పూర్తి చేశారని చెప్పవచ్చు. అయితే పబ్ లోపలికి డ్రగ్స్ తీసుకు వచ్చిన వారిని పోలీసులు గుర్తించారు .. పబ్ పై దాడి చేసి 148 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులు పబ్ లోకి డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తేలింది. అయితే పబ్ యజమానికి వ్యవహారం మొత్తం తెలిసే డ్రగ్స్…
గంజాయి స్మగ్లర్లు కొత్తకొత్త రూట్లలో ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. కొత్త తరహాలో కొత్త రూట్ లో పుష్పకు మించిన తెలివితేటలతో గంజాయిని సిటీలకు చేరవేస్తున్నారు…గంజాయి స్మగ్లర్లు తెలివితేటలు చూసి పోలీసులు అవాక్కవుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో 70 కిలోల గంజాయిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి నేరుగా హైదరాబాద్ గల్లిలోకి చేరవేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి రోడ్డు మార్గం ద్వారా స్మగ్లింగ్ జరుగుతోందని పోలీసులు భావించారు.…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిన్న, నేడు తెలంగాణలో పర్యటించిన విషయం విధితమే. అయితే.. నిన్న వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ.. తెలంగాణాకు ఎవరైనా రావొచ్చన్న అసద్.. రాహుల్‌కు తెలంగాణ గురించి ఏమీ తెలియదన్నారు. అంతేకాకుండా.. ఏం మాట్లాడాలో అని అడిగిన రాహుల్…
సరూర్ నగర్లో ఇటీవల జరిగిన హత్య గురించి.. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేది.. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడని, కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లే అంటూ మండిపడ్డారు. అసద్ మనసులో ఉంది ఒకటి… నోటి…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో తెలంగాణకు వచ్చారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో రిమోట్ జరగడం లేదని.. మీ కాంగ్రెస్‌ది రిమోట్ పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. మీరు చెప్పినవన్నీ నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, ఇక్కడి…