కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్‌లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం కోరుట్లపేటలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కోట్లతో 2 లక్షల 70 వేల ఇండ్లను నిర్మించి ఇస్తుందని వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంచి నాణ్యతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏ రాష్ట్రం నిర్మించి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు కేటీఆర్. పల్లె ప్రగతిలో మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని, 50 వేల కోట్లను రైతుబంధు విడుదల చేశామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా త్వరలో కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.