తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా.. తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రజలకు గౌరవనీయమైన గవర్నర్ సందేశమిచ్చారు. గౌరవనీయులైన తెలంగాణ సోదర సోదరీమణులారా, ప్రగాఢమైన వినయం మరియు లోతైన గౌరవ భావంతో, నేను ఈ రోజు తెలంగాణ కొత్త గవర్నర్గా…
అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో కేటీఆర్ రన్నింగ్ కామెంట్రి, సభను తప్పు దోవ పట్టించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అగౌరపరిచేలా ఎక్కడా మాట్లాడలేదన్నారు. గతంలో కేసీఆర్ మహిళలను వ్యక్తి గతంగా కించపరిచే మాటలు మాట్లాడిన సబితమ్మకు గుర్తు లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ గవర్నర్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రజలకు తెలుసు అని, సీఎల్పీ గా భట్టి…
ఖమ్మం టూ సూర్యాపేట వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. సూర్యాపేట హైవే పై ఎంట్రీ వద్ద ఫ్లై ఓవర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే.. ఫ్లై ఓవర్ మంజూరుకు ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చర్చించగా ఆర్ అండ్ బీ ప్రఫోజల్స్ కు ఎన్ఎచ్ఏఐ ఆమోదం తెలిపింది. దీంతో.. ఫ్లై ఓవర్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులతో చర్చించి సత్వరమే పనులు…
పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ… జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం…
మా మహిళా శాసనసభ్యులపైన అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి నికృష్టంగా మాట్లాడారని, ఈ అవమానం కేవలం సబితక్కకు సున్నితక్కకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానమన్నారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందన్నారు. సునితక్క కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు అయ్యాయన్న సీఎం రేవంత్… కానీ అక్క ఆ పార్టీలోకి వెళ్లి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. మేం ఏ తప్పు చేయలేదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ…
చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలకి , రైతులకు సీఎం ,కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్ లో చాలా మంది రైతులకు బ్యాంక్ లు రుణాలిచ్చే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్షలాది రూపాయలతో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు… వేలాది లీటరు లతో పాలాభిషేకం చేయించుకుంటున్నారని,…
తెలంగాణకు చెందిన ఒకరితో సహా ఐఏఎస్కు సిద్ధమవుతున్న ముగ్గురు ఢిల్లీలో వరదలతో నిండిన సెల్లార్లో ప్రాణాలు కోల్పోయినందున, అటువంటి సంఘటనలను హైదరాబాద్లో నివారించడానికి , పరిష్కరించడానికి పౌర అధికారుల సామర్థ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిమిషాల వ్యవధిలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో, అనధికార నిర్మాణాలు , ఆక్రమణలపై అధికారులు సకాలంలో కఠినంగా వ్యవహరిస్తారు , అదే సమయంలో నాలాలను శుభ్రం చేసి, అటువంటి సంఘటనలు , ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు అధికారులు భయపడుతున్నారు. Tollywood Producer: స్కెచ్చేసి 40…
తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్ల నుంచి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని,…