Kishan Reddy : చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు
- భవిష్యత్‌లో చాలా మంది రైతులకు బ్యాంక్‌లు రుణాలిచ్చే పరిస్థితి లేదు
- కౌలు రైతులకు.. రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారు
- రైతులకు పంట బొనస్ ఇవ్వలేదు
- ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలకి , రైతులకు సీఎం ,కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్ లో చాలా మంది రైతులకు బ్యాంక్ లు రుణాలిచ్చే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్షలాది రూపాయలతో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు… వేలాది లీటరు లతో పాలాభిషేకం చేయించుకుంటున్నారని, కౌలు రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారని ఆయన అన్నారు. రైతులకు పంట బొనస్ ఇవ్వలేదని, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం… ఆ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
Andhra Pradesh: ఏపీలో ప్రజలకు గుడ్‌న్యూస్.. రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులు
Also Read
బీఆర్‌ఎస్ రైతులను వెన్నుపోటు పొడిచింది.. ఫలితం అనుభవించిందని, రైతులు కాంగ్రెస్ పార్టీ నీ ప్రశ్నించాలి… కంటి తుడుపు చర్యగా, నామ మాత్రంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. సోనియా గాంధీ ప్రతి ఇంటికి లెటర్ పంపించింది… ఇప్పుడు 6 గ్యారంటీ ల అమలులో ఎందుకు చొరవ చూపడం లేదని, బడ్జెట్ మసి పూసి మారేడు కాయ చేసేలా ఉందన్నారు కిషన్ రెడ్డి. రైతుకు, మహిళలకు, యువతకు, బీసీ లకు వెన్నుపోటు … మోసం చేసిందని, ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ ల బడ్జెట్ ను తగ్గించారన్నారు. బడ్జెట్ లో గాలి లెక్కలు, నీటి మీద రాతలు అని కిషన్ రెడ్డి విమర్శించారు.
CM Chandrababu: మదనపల్లి ఫైల్స్ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసిన సీపీఐ బృందం
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!