ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కు అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని, దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నాం, ఈ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవతోనే ఎస్సీల 30 ఏళ్ల కల నెరవేరిందని, ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించిందన్నారు…
తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ 1లో జరిగిన ఈ కేబినెట్ భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది. మంత్రివర్గంలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. వయనాడ్ ఘటన, రేషన్ కార్డులు, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటి స్థలం కేటాయింపు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై చర్చ కొనసాగింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన.. సోనియమ్మ నాయకత్వం.. అంటూ ఊదరగొడుతున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో మహిళల పాత్ర ఉందని, రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వణికిపోతున్నారన్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఐదు అత్యాచారాలు జరిగాయని, అసెంబ్లీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలం నాలుగున్నర గంటలు నిల్చుంటే మాకు మైక్ ఇవ్వలేదన్నారు సబితా ఇంద్రారెడ్డి. ఆడబిడ్డలకు మైక్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డికి…
గంటన్నర పాటు సాగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ పేరు ‘భూమాత’గా మారుస్తూ కేబినెట్ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ…
జనగామ జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారు.బాధితుల వద్ద నుండి అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీ ద్వారా కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నరు. 2024 ఫిబ్రవరిలో జనగామలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో,స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారంటూ ఫోన్ చేసి ఫేక్ మెయిల్ ఐడి తో ఆర్డర్ కాపీని పంపి సైబర్ నేరగాల్లో నమ్మ బలికిస్తున్నారు.నిజమేనని నమ్మి ఇంటర్వ్యూ కొరకు…
గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. వారి అరాచకం తెలంగాణ మొత్తం చూసిందని, నిన్న అప్రాప్రేషన్ బిల్లు పై బీజేపీ మాట్లాడకుండా చేసారన్నారు. మా గొంతు నొక్కారని ఆయన మండిపడ్డారు. అప్పటికే మేము ఓపికతో ఉన్నామని, బీఅర్ఎస్ నేతలకు ఇష్టం లేకుంటే వాక్అవుట్ చేయాలన్నారు. వెల్ లోకి వెళ్లి అరవడంతో సభ్యులెవరూ మాట్లాడేందుకు రాలేదని, ఈరోజు కూడా…
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అహంకారి, ఫ్యాక్షనిస్ట్, ఫ్యూడల్ గా లాగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తాలిబన్ సంస్కృతికి వారసుడిలా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని ఆయన ధ్వజమెత్తారు. గతంలో రేవంత్ రెడ్డి…
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇటీవల మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కేవలం 48 గంటల్లోనే సామూహిక అత్యాచారాలు, దాడులు సహా నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. National Girlfriends Day 2024: జాతీయ గర్ల్ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?…
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా.. తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రజలకు గౌరవనీయమైన గవర్నర్ సందేశమిచ్చారు. గౌరవనీయులైన తెలంగాణ సోదర సోదరీమణులారా, ప్రగాఢమైన వినయం మరియు లోతైన గౌరవ భావంతో, నేను ఈ రోజు తెలంగాణ కొత్త గవర్నర్గా…
అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో కేటీఆర్ రన్నింగ్ కామెంట్రి, సభను తప్పు దోవ పట్టించే విధంగా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అగౌరపరిచేలా ఎక్కడా మాట్లాడలేదన్నారు. గతంలో కేసీఆర్ మహిళలను వ్యక్తి గతంగా కించపరిచే మాటలు మాట్లాడిన సబితమ్మకు గుర్తు లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. మహిళ గవర్నర్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ప్రజలకు తెలుసు అని, సీఎల్పీ గా భట్టి…