ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కు అనుమతిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదని, దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నాం, ఈ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవతోనే ఎస్సీల 30 ఏళ్ల కల నెరవేరిందని, ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేసిన పోరాటం ఫలించిందన్నారు అరుణ. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతగానో కృషి చేశారని, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారంటూ తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు చెంప పెట్టు లాంటిదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడు అనడానికి ఈ తీర్పే ఉదాహరణ అని ఆమె వ్యాఖ్యానించారు.
Allu Sirish: సక్సెస్ పార్టీ చేసుకోవాలని అనుకున్నా కుదరలేదు.. అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్
ఎస్సీ వర్గీకరణకు సహకరించి ఆ వర్గాల చిరకాల కల నెరవేరేలా కృషి చేసిన ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు డీకే అరుణ. ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగతి పోరాటం చేసిన మందకృష్ణ మాదిగను గత ప్రభుత్వాలు మోసం చేస్తే.. ఇచ్చిన మాటను బీజేపీ నిలుపుకుందని సగర్వంగా చెబుతున్నానని, ఈ దేశంలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి , అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమన్నారు. ఈ విషయం ఈ తీర్పుతో మరోసారి రుజువైందన్నారు. ఎస్సీ వర్గీకరణ క్రెడిట్ పూర్తిగా బీజేపీదే.. ఈవిషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు డీకే అరుణ. ఈ తీర్పుతో ఎస్సీ సామాజిక వర్గాలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు.
Average Student Nani: హీరో డీగ్లామర్‌గా ఉండాలని నేనే చేసేసా.. దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు