ఇటీవల ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలిలాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులవి ఆత్మహత్యలు కావు ప్రిజనరీ జగన్ ప్రభుత్వ హత్యలే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రివర్స్ పాలనలో రివర్స్ రిజల్ట్స్ వచ్చాయని, టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చూసిన తరువాత షాక్ కి గురయ్యానని తెలిపారు. కనీస అవగాహన లేని ప్రిజనరీ వ్యక్తి సీఎం అయితే…
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్ల ఘటనలో వైసీపీ వారు చెప్పారని అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే టీడీపీ వారు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిద్రపోయిన సమయంలో అనారోగ్యంతోనే గంగాధర్‌రెడ్డి మృతిచెందినట్లు అతని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో జిల్లా…
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT-K), క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా మోసానికి సంబంధించిన కేసులను గుర్తించడంలో మరియు ఛేదించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహాయపడేందుకు దేశీయంగా రూపొందించిన సాధనాన్ని అందజేస్తుంది. ఐఐటీ కాన్పూర్ నుండి ప్రొఫెసర్ సందీప్ శుక్లా మాట్లాడుతూ.. హోప్ (HOP) అని పిలువబడే ఐఐటీ అభివృద్ధి చేసిన సాధనం క్రిప్టోకరెన్సీ లావాదేవీలను విశ్లేషించగలదన్నారు. ఈ సాధనం మిగితా విదేశీ పరికరాల కంటే చౌకైనదని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు నాటికి, మా టూల్ యూపీ పోలీసులకు…
దేశంలో గృహ రుణాల లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకులు వ్యక్తులకు మంజూరు చేయగలిగే గృహ రుణ పరిమితిని రెట్టింపు స్థాయికి ఆర్బీఐ సడలించింది. ఈ పరిమితిని అర్బన్ సహకార బ్యాంకులకు రూ.75 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెంచింది. అలాగే గ్రామీణ సహకార బ్యాంకుల్లోనూ రూ.75 లక్షల వరకు గృహ రుణం పొందవచ్చు. ప్రస్తుతం ఇది రూ.30 లక్షలుగానే ఉన్నది. కాగా, అర్బన్ కోఆపరేటివ్…
ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే.. కోవిడ్ కారణం గత రెండు సంవత్సరాలు పూర్తిస్థాయిలో శ్రీవారి దర్శనాలు ప్రారంభించలేదు. అయితే ఇటీవల పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతించడంతో తిరుమలకు భక్తులు తాకిడి పెరిగింది. అయితే స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ లేకుండా గంటరన్న వ్యవధిలోనే దర్శన…
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అరెస్టైన వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 20 వరకు అనంతబాబు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు కోర్టు సోమవారం ప్రకటించింది. అంతేకాకుండా అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నట్లు ఎస్సీ,ఎస్టీ కోర్టు వెల్లడించింది. అయితే ఇప్పటికే.. సుబ్రహ్మణ్యాన్ని తానే చంపినట్లు అనంతబాబు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా… ఆయనను…
ఇటీవల మహ్మద్ ప్రవక్త మీద నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాల్లో ఆగ్రహావేశాలు రగిల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంత రావు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆలోచన.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలు రోజుకొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడు. కర్నాటకలో ఈశ్వరప్ప జాతీయ…
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. అయితే ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖలలో ఖాళీల భర్తీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే 8 సంవత్సరాల తరువాత నోటిఫికేషన్లను విడుదల కావడంతో నిరుద్యోగులు రికార్డు స్థాయిలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల కానుంది. పురపాలక శాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196…
రాష్ట్రంలో కొత్తగా మరో ముగ్గురు మహిళల పై అఘాయిత్యం జరిగాయి. పోలీసుల లెక్కల చూస్తే..మహిళలలపై రేప్ కేసులు పెరిగాయి.. ఇదేనా బంగారు తెలంగాణ అంటే కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి మండిపడ్డారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పసి పిల్లలకు కూడా తెలంగాణ లో రక్షణ లేదని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసు ను నీరుగారుస్తున్నారని, మైనర్ బాలిక…