హైదారాబాద్‌లో వరుస అత్యాచార ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కార్ఖానలో వెలుగు చూసిన మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్‌లో అమ్మాయిని యువకులు ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఐదుగురు యువకుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయితో స్నేహంగా ఉంటూనే యువకులు లైంగిక వాంఛ తీర్చుకున్నారు.
మైనర్ బాలికపై రెండు లాడ్జిలలో లైంగిక దాడికి జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే.. ఇద్దరు మైనర్లు, ముగ్గురు మేజర్లతో పాటు ఇద్దరు లాడ్జి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరికి వారు బాలికను ట్రాప్ చేసి లైంగిక కోరిక తీర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కార్ఖాన పోలీసులు.. బాధితురాలి విజ్ఞప్తితో గోప్యంగా పోలీసులు దర్యాప్తు జరిపినట్లు సమాచారం.