ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు పంజాయ్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.
ఢిల్లీ సర్కార్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఢిల్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆప్ ఆరోపిస్తుంది.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచార రాకెట్ ముఠా గుట్టును అక్కడి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు మహిళలను రక్షించిన పోలీసులు.. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ప్రపంచ మీడియా మొఘల్ 92 ఏళ్ల రూపర్ట్ మర్డాక్ ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్ళికి సిద్ధమయ్యారు.