సోషల్ మీడియా ప్రచారంపై పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్‌లు స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వసంత కృష్ణ ప్రసాద్ పై ఉద్దేశ పూర్వకంగా మీడియా వాట్సప్ గ్రూప్ లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇది ఎవరో చేసిన కిరాతక చర్య అని ఆయన ధ్వజమెత్తారు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారు ఇలాంటి ప్రచారాలు చేయరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ తరపున అభ్యర్ధి ఓట్లను కోఆర్డినేట్ చేసే బాధ్యత నాకు వుందని, నా గ్రూప్ లో కృష్ణప్రసాద్ లేరన్నారు. ఆయన్ను నేను ఎందుకు అడుగుతానని, కృష్ణ ప్రసాద్ ఉదయం 8.45కే అసెంబ్లీ కి వచ్చారు, టీ బ్రేక్ టైం లో ఓట్ వేశారు, కృష్ణ ప్రసాద్ పై దుష్ప్రచారం చేస్తున్న వారు అయన వ్యక్తిగత శత్రువులో, పార్టీ పరంగా లాభం పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారో తెలియదన్నారు.
Also Read : Dmitry Medvedev: పుతిన్‌ను విదేశాల్లో అరెస్టు చేయడం అంటే యుద్ధాన్ని ప్రకటించినట్లే..
దీన్ని మేము ఖండిస్తున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు. అనంతరం.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..పేర్ని వెంకట్రామయ్య, వసంత నాగేశ్వరరావు లు మంచి స్నేహితులన్నారు. పేర్ని నాని నా కన్నా రాజకీయాల్లో సీనియర్, మంత్రిగా పని చేశారని, నాకు ఏ సమస్య వున్న పేర్ని నాని కు చెప్పేవాడినన్నారు. నాది నలుగురితో ఘర్షణ పడే మనస్తత్వం కాదని, జీవితకాలం మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు వున్నాయన్నారు వసంత కృష్ణప్రసాద్. కొందరు గిట్టని వారు కావాలనే ఈ ప్రచారాన్ని తెచ్చారని, వాళ్ళు ఎవరో నాకు తెలుసు …అది వల్ల కర్మ అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read : Yash: ఇది KGF 3 కాదు పెప్సీ యాడ్…