మరి కొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కాబోతుంది. సీజన్ -16కు అన్ని జట్లలోని కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారు. ఇదే బాటలో ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు పంజాయ్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అతను గతేడాది అక్టోబర్ నుంచి కాలి గాయం కారణంగా క్రికెట్ కు దూరంగా బెయిర్ స్టో ఉన్నాడు. అయితే అతడు మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిటినెస్ సాధించాడు.
Also Read : Ghost Detector : దెయ్యాలను చూడాలని ఉందా.. వెంటనే ‘ఘోస్ట్ డిటెక్టర్’ కొనేయండి
బెయిర్ స్టో ప్రస్తుతం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఈ ఏడాది జరగనున్న యాషెష్ సిరీస్ సమయానికి అతడు మరింత ఫిట్ గా ఉండాలని భావిస్తున్నట్లు సమచారాం. అందుకోసం అతడు ఐపీఎల్ 16వ సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. రాబోయే యాషెష్ కోసం జానీ బెయిర్ స్టో యార్క్ షైన్ లో ప్రాక్టీ్స్ చేయనున్నాడు. దీంతో జానీ బెయిర్ స్టో ఐపీఎల్ -2023కు దూరం కానున్నాడు.
Also Read : KTR Tweet: ఓపిక పడుతున్నాం మంత్రి ట్విట్ వైరల్
ఇప్పటికే ఈ విషయాన్ని పంజాబ్ ఫ్రాంఛైజీకు అతడు తెలియజేశాడు.. అని ది గార్డియన్ తమ నివేదికలో పేర్కింది. ఇక ఐపీఎల్ లో ఇప్పటి వరకు 39 మ్యాచ్ లాడిన జానీ బెయిర్ స్టో.. 142.65 స్ట్రైక్ రేట్ తో1291 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 9 హాప్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. మార్చ్ 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం కానుంది. పంజాబ్ తన తొలి మ్యాచ్ లో ఏప్రిల్ 1న కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది.