రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు బండి సంజయ్. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పిన విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థినిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో…
మాదాపూర్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పటికీ లాభాలు లేకపోవడంతో డ్రగ్స్ అమ్మకాలు మొదలుపెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పెద్ద మొత్తంలో లాభాలు గడించాలని డ్రగ్స్ అమ్మకాలకు తెరలేపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ నేపథ్యంలోనే.. నిందితులు దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి…
రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు ధీటుగా కుల గణన జరగాలని దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుండి చాటుతున్న మహనుభావుడన్నారు. అందుకే చంపేస్తామని బెదిరిస్తున్నారని, బీసీ ల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ చెప్పినట్టు జిస్కి జిత్ని అబాధి , ఉస్కి…
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే…
ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్…
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్తూ పార్టీని ముందుకు నడిపిన వ్యక్తిగా పీసీసీగా నియామకం అయ్యారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర NSUI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ NSUI అధ్యక్షుడిగా ఉన్నాని ఆయన అన్నారు. మహేష్ అన్న నాకంటే ఎక్కువ శ్రమ పడ్డారు.. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నారని, వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో బలహీన వర్గాల నుండి జెండా పట్టుకొని పైకి…
ఆస్పత్రి యాజమాన్యం చేసిన తప్పు ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది. చేతులు కాలాక ఆకులు పట్టుకునే అధికారుల తీరుతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొన్యాలలో 45 రోజుల పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. బాబు మృతికి కారణాన్ని తెలుసుకునేందుకు 10 రోజుల తర్వాత మృతదేహాన్ని బయటికీ తీసి పోస్టుమార్టం చేశారు. ఈ నెల 5న జ్వరంతో ఉన్న 45 రోజుల పసికందు దష్విక్ ని తల్లిదండ్రులు…
రేపు నల్గొండ జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పరిశీలించనున్నారు. అమెరికాలోని రాబిన్ సన్ సంస్థ నూతన టెక్నాలజీని వాడాలని ప్రభుత్వం నిర్ణయింది. ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాల్లో SLBC పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడేది లేదని మంత్రి…
హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లోని ఓ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన భారీ పేలుడులో ముగ్గురు తీవ్రంగా సహా కనీసం ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కిషన్‌బాగ్‌లోని జనసాంద్రత ఎక్కువగా ఉండే అసద్‌బాబా నగర్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావం కారణంగా, ఆస్బెస్టాస్ పైకప్పు ఉన్న ఇల్లు బాగా దెబ్బతింది , ఆ ప్రాంతంలో ష్రాప్నల్ ఎగిరి పొరుగు భవనాల గాజు ముఖభాగాన్ని…
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వనకు పుట్టిస్తున్నారు రెవెన్యూ, హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎకరాల కొలది భూములను చెరపట్టారు. భూకబ్జాదారుల నుంచి భూములను విముక్తి కల్పించడానికి కాప్రా రెవెన్యూ అధికారులు దూకుడు మొదలుపెట్టారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడులకు ఐదు ఎకరాల భూమిపై నోటీసులు జారీచేసిన రెవెన్యూ అధికారులు. డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి…