నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. మంత్రికి.. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతనంగా నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూర్ జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. వరద బాధితుల కోసం 30టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి… అనంతరం గురుపూజోత్సవంలో…
బీజేపి నేతలు రాహుల్ గాంధీ పై వివాదాస్పద వాఖ్యలను నిరసిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ జక్షన్ వద్ద వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనకు ముఖ్యఅతిధిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, బీజేపీ పార్టీ వాళ్లు.. రాహుల్ గాంధీ కుటుంబం కాలిగొట్టికి కూడా సరిపోరన్నారు. కొందరు వెధవలు…
ఇటీవల భారీ వర్షాల బీభత్సానికి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే.. ముంపు బాధితులను ఆదుకోవడానికి తమకు తోచినంత ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20లక్షలు విరాళం అందజేసింది టెక్నో పెయింట్స్ సంస్థ.…
చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే అద్భుతమైన MSME పాలసీ మనది అని ఆయన అన్నారు. ఇంత వరకు…
బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణగూడ చౌరస్తాలో బీజేపీ నేత దిష్టిబొమ్మను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా నారాయణగూడ చౌరస్తాలో నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు వెంటనే రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై…
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు సూచించారు. సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవిశ్రీరాంపూర్ వంటి మూడు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. ఇంటర్నెట్తో పాటు, కేబుల్ టీవీ సేవలు, కంప్యూటర్ కనెక్టివిటీ, మొబైల్ ఫోన్లకు 20 MBPS అపరిమిత డేటా కూడా ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా అందించబడుతుంది. 360 డిగ్రీల…
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణనాథుల నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు వెల్లడించారు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు.…
హైదరాబాద్ కూకట్ పల్లి IDL చెరువు వద్ద ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను అడిగి నిమజ్జన ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా వినాయక నిమజ్జనాలు జరుగుతాయన్నారు. చెరువుల్లో బేబీ పాండ్ లను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను నిమజ్జనాలు చేస్తున్నారన్నారు. హుస్సేన్ సాగర్ లాంటి మురికి నీళ్లల్లో నిమజ్జనం చేయడం బాధాకరమన్నారు ఈటల రాజేందర్. ప్రభుత్వం ప్రత్యేకంగా…
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారినందున వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు. మంగళ వారం నాడు న్యూ ఢిల్లీ లోని భారత…