మాదాపూర్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పటికీ లాభాలు లేకపోవడంతో డ్రగ్స్ అమ్మకాలు మొదలుపెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పెద్ద మొత్తంలో లాభాలు గడించాలని డ్రగ్స్ అమ్మకాలకు తెరలేపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ నేపథ్యంలోనే.. నిందితులు దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏ మార్ట్ లను పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటల్ మేనేజ్మెంట్, చిరు ఉద్యోగం చేస్తున్న ముగ్గురు యువకులు వస్తున్న ఆదాయాన్ని సరిపోవడం లేదని ఒకటికి మూడింతలు లాభాలు గడించాలని పక్క దారిలో నడుస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలైన ముగ్గురు వ్యక్తుల ఉదాంతం ఇది అని పోలీసులు వివరించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కాపు కాసి డ్రగ్స్ అమ్మకాలకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులనుపట్టుకున్నారు. ఈ ముగ్గురి వద్ద 5.77 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో. దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏ మార్ట్ ఉన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. బెంగళూరు నుంచి దిగుమతి చేసే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
India-US: ఉగ్రవాది కేసులో భారత్ కు అమెరికా సమన్లు.. స్పందించిన విదేశాంగ శాఖ