మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు…
IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్లో స్పష్టమైంది.…
ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. పోలీసులు రివీల్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం, రవి తొలి నుంచే క్రిమినల్ మెంటాలిటీతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేర స్వభావం ఉండడమే కాకుండా, స్నేహితుడు నిఖిల్ పేరుతో నమోదు చేసిన ఐడీ కార్డులను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి నడవడి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి కీలక వివరాలు కూడా బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా రవి భార్యను కూడా…
Sri SathyaSai Dist: శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో సత్యసాయి మహా సమాధిని భక్తులు అలంకరించారు.
ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.
Maoists Surrender : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభుత్వం నడుపుతున్న ఆపరేషన్లు మరోసారి పెద్ద ఫలితాన్ని సాధించాయి. మొత్తం 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవోబీ (ఆంధ్ర–ఒడిశా సరిహద్దు) ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ఆజాద్, గత కొంతకాలంగా భద్రతా దళాల నిఘాలోనే ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.…
Terror Attack Plan: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జైష్ ఉగ్ర సంస్థ భారత్లో మరో ఆత్మాహుతి దాడికి ప్లాన్ రచించిందని తెలుస్తోంది.
Yellareddyguda incident : అమీర్పేటలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విషాదం నెలకొంది. కీర్తి టవర్స్ అపార్ట్మెంట్లో ఏడు ఏళ్ల చిన్నారి లిఫ్ట్లో ఇరుక్కుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కీర్తి టవర్స్ ఐదో అంతస్తులోని 503 ఫ్లాట్ లో ఐశ్వర్య, నర్సీ నాయుడు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండో కొడుకు హర్ష వర్ధన్ (7) అమీర్పేట ఎల్లారెడ్డి గూడలోనీ ఓ ప్రైవేట్ స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో…
Crime News: లెస్బియన్ అఫైర్ తో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది.. ఏకంగా 6 నెలల పిసికూన అయిన కన్న కొడుకునే చంపేసింది ఓ మహిళ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్ (38). అతను దినసరి కూలీ. అతను మరియు అదే ప్రాంతానికి చెందిన భారతి (26) 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి 5 మరియు 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు…